బైక్‌ అదుపు తప్పి ఓ యువతి మృతి చెందిన సంఘటన మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పూణేకు చెందిన మిథాలిశర్మ (20)మాదాపూర్‌ లోని నిఫ్టులో 6వ సెమిస్టర్‌ చదువుతోంది. గురువారం ఉదయం ఆమె తన స్నేహితుడు రిక్టిమ్‌తో కలిసి బైక్‌పై బోరబండ నుంచి కళాశాలకు వెళుతుండగా వంద అడుగుల రోడ్డులో ముందు వెళ్తున్న ట్రక్కును తప్పించబోయి సడన్‌ బ్రేక్‌ వేయడంతో బైక్‌ అదుపుతప్పి ఇద్దరూ కింద పడ్డారు. ఈ ఘటనలో మిథాలీ శర్మకు తలకు తీవ్ర గాయాలు కావడంతో మాదాపూర్‌ మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రిక్టిమ్‌కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.