లింగాపురం గ్రామానికి చెందిన ఆరెల్లి శిరీష-రాకేష్ దంపతుల కూతురు శ్రీజ (3) ఈ రోజు ఉదయం ఇంటి ముందు బొమ్మలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ ఇంటి ముందున్న నీటి తొట్టిలో పడి మృతి చెందింది. ఆడుకుంటోందన్న ఆలోచనతో ఇంట్లోని వారు పనుల్లో నిమగ్నమై చిన్నారిని గమనించలేదు.
Advertisement
కాసేపటికి చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఇంట్లోనూ, ఆరు బయట వెతికారు. చివరికి నీటితొట్టిలో చూడగా చిన్నారి శవమై నీళ్లలో తేలియాడుతూ కనిపించింది. పండుగ రోజున చిన్నారి మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.