బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అండగా నిలుస్తారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు..

గోదావరి నది బోటు ప్రమాదంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాయంపేట కు చెందిన దోమల హేమంత్ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియా చెక్కును అందించడం జరిగింది..

  • 👉 బోటు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఎల్లవేళలా అండగా ఉంటాం..
  • 👉 గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు నిరు పేదల పక్షపాతి..
  • 👉 బోటు ప్రమాదంలో మృతి చెందిన నిరుపేద కుటుంబాలకు పెద్ద మనసుతో ఎక్స్గ్రేషియా ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు..
  • 👉 బోటు ప్రమాదం చాలా భాదకరం ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపింది..
  • 👉 ఈరోజు హేమంత్ కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇచ్చేందుకు పదిహేను లక్షల రూపాయల చెక్కును హేమంత్ తల్లిదండ్రులు భూమయ్య పద్మావతిలకు అందించడం జరిగింది..
  • 👉 అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి శాయంపేటకు నిరుపేద కుటుంబానికి చెందిన కాంతమ్మ, బుచ్చి రాములుకు సీఎం సహాయనిధి నుండి లక్షా యాభై వేల రూపాయల విలువ గల చెక్కులను అందించడం జరిగింది..
  • 👉 సుజిత్ నగర్ లో నివాసముంటున్నటువంటి కోతుల వాళ్లకు అన్ని రకాలుగా అండగా నిలుస్తూ వారికి అతి త్వరలో శాయంపేట లో నిర్మించబోయే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వారికి అవకాశం కల్పిస్తాం..
  • 👉 సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు అత్యున్నత స్థానం కల్పించడంమే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం..
  • 👉 నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై అభివృద్ధికి కృషి చేయాలి..

కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అరుణ శివశంకర్ గారు ఆర్డిఓ వెంక రెడ్డి గారు ఎమ్మార్వో నాగేశ్వరావు గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గోన్నారు