ఇంటికోసం తీసుకున్న అప్పు 6 లక్షలు.. కట్టింది 8 లక్షల 75 వేలు.. మళ్లీ 4 లక్షల 70 వేలు కట్టమని లేకుంటే ఇల్లు వేలం వేస్తామని బెదిరింపు, దీంతో ఇంటిపై మమకారం, బ్యాంకు అధికారులు పరువు బజారుకు లాగుతున్నారన్న బాధతో అమ్మా , కూతురు పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డారు , 40 ఏళ్ల తల్లి లీనా, 17 ఏళ్ల కూతురు వైష్ణవి ఉదంతం కేరళలో సంచలనం సృష్టిస్తోంది.. వేలకోట్ల అప్పులు ఎగవేసే వారికి రాచ మర్యాదలు చేసే బ్యాంకులు సామాన్యులు సక్రమంగా అప్పు కడుతున్నా ఇలా వేధింపులకు పాల్పడిన ఘోరం నిన్న త్రివేండ్రం లో జరిగింది..