బ్రిటీష్ రాజ కుటుంబంలో ఉద్యోగానికి ది బ్రిటీష్ రాయల్ కమ్యూనికేషన్స్ టీమ్ ఆహ్వానం పలికింది. బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ, క్వీన్ ఎలిజబెత్-2 ఉనికిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేందుకు సోషల్ మీడియా మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తు ఆహ్వానించింది. ఈ విషయాన్ని ది బ్రిటీష్ రాయల్ కమ్యూనికేషన్స్ టీమ్ తన జాబ్ లిస్టింగ్ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఈ జాబ్ కు ఎంపికైన మీడియా మేనేజర్ రాణిగారిని సోషల్ మీడియాలో కొత్తగా చూపించాల్సి ఉంటుంది. అందుకోసం అనేక మార్గాలను అన్వేషించాలి. ఇందుకోసం వారికి నెలకు 30వేల బ్రిటీష్ పౌండ్లు (భారత కరెన్సీలో రూ. 26,57,655) జీతం ఇవ్వనున్నారు. అంతేకాదు జీతంలో 15 శాతం పెన్షన్ పథకం, 33 రోజుల వార్షిక సెలవులు (బ్యాంక్ సెలవులతో కలిపి). ఉచిత భోజనం, వారానికి ఐదు రోజులే పని దినాలు.
ఉద్యోగానికి కావాల్సిన అర్హతలేటంటే ? డిగ్రీ, వెబ్ సైట్ లో పనిచేసిన అనుభవం, ఫోటోగ్రఫీ, వీడియో నైపుణ్యంతో పాటు ప్రాధాన్యతలను బట్టి చురుగ్గా స్పందించాలి. డిజిటల్, సోషల్ మీడియా కంటెంట్ ను క్రియేట్ చేయాలి. లేటెస్ట్ డిజిటల్ కమ్యూనికేషన్స్ డెవలప్‌మెంట్స్ అవగాహన ఉండాలి. డిజిటల్ కంటెంట్ రూపకల్పనలో నైపుణ్యంతో పాటు రైటింగ్ స్కిల్స్ ఉండాలి. రోజు వార్తా విశేషాలను, ఫీచర్ కథనాలను చదవాల్సి ఉంటుంది.