బ్రేకింగ్ న్యూస్: వైఎస్ జగన్‌పై హత్యాయత్నం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయనపై ఓ దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్ జగన్‌పై దుండగుడు దాడి చేశాడు. కోడి పందెలకు ఉపయోగించే కత్తితో అతను జగన్‌పై దాడి చేశాడు. దీంతో వైఎస్ జగన్ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్ శ్రీనివాస్‌గా గుర్తించారు.
ఈ ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయంలోని ప్రవేశించే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. లోనికి ఎవరినీ రాకుండా అడ్డుకుంటున్నారు. జగన్‌పై దాడి సమాచారం తెలుసుకున్న వైకాపా నేతలు పెద్దయెత్తున విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. స్థానిక ఏసీపీ హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకుని సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు.
దాడికి పాల్పడిన నిందితుడి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.