కాజీపేట రైల్వేస్టేషన్లోని యార్డులో ఆగి ఉన్న రైలు బోగీ‌ల్లో ఆదివారం తెల్లవారుజామున 2:30నిమిషాలకు అగ్నిప్రమాదం సంభవించింది. రెండు బోగీ‌ల నుంచి పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. రైల్వేస్టేషన్‌ నుంచి బోడగుట్టకు వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలం పక్కనే డీజిల్‌ ట్యాంకర్లు ఉన్నాయి. వాటిని అధికారులు అక్కడ నుంచి వేరే చోటికి తరలించారు.

దాదాపు అరగంట సేపు ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. ప్రమాదం సంభవించినపుడు రైల్వే బోగీల్లో ప్రయాణికులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.