శ్రీ వికారినామ సంవత్సర నూతన పంచాంగాన్ని ఈరోజు స్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతి దేవాలయంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. శ్రీ వికారినామ సంవత్సరంలో జరగబోయే మంచిచెడుల గురించి ఈ పంచాంగము నందు పేర్కొనడం జరిగిందని సభకు అధ్యక్షత వహించిన పంచాంగ కర్త భద్రకాళి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి శ్వేతార్కగణపతి ఆలయ వ్యవస్థాపకులు మరియు విద్వత్సభ ఉపాధ్యక్షులు అయినవోలు అనంతమల్లయ్య శర్మ సిద్దాంతి వివరించారు. ఈ కార్యక్రమంలో శ్వేతార్క గణపతి ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర శర్మ, బాసర దేవస్థానం సామవేద పండితులు నవీన్ శర్మ,మరియు త్రిగుళ్లశ్రీనివాస శర్మ, కందికోట శ్రీనివాస్ శర్మ, యల్లంభట్ల రవీందర్ శర్మ ,రాధాకృష్ణ, సాయి శర్మ , అడ్లూరు శ్రీధర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సామవేద పండితులు నవీన్ శర్మ పంచాంగం ఆవిష్కరిస్తూ వరంగల్ భద్రకాళీ దేవస్థానం పంచాంగము ఎంతో ప్రాచుర్యమును పొందినదని హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ సిద్దిపేట సంగారెడ్డి జనగామ హుస్నాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో వేలాది మంది పంచాంగ అభిమానులు ఉన్నారని తెలియజేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి అయినవోలు రాధాకృష్ణ శర్మ అయినవోలు సాయి కృష్ణ శర్మ నిర్వాహకులుగా వ్యవహరించారు. పంచాంగం కావలసిన వారు శ్వేతార్క గణపతి క్షేత్రంలో, భద్రకాళి దేవస్థానంలో లభ్యమవును.