మట్టెవాడ : భద్రకాళీ దేవస్థానం మూడు నెలల ఆదాయం రూ . 49 , 76 , 647లు వచ్చినట్లు పర్యవేక్షణాధికారిగా అనిల్ కుమార్ తెలిపారు . ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ, వచ్చిన ఈ ఆదాయాన్ని ఆలయ అకౌంట్లో జమ చేశామని తెలిపారు . హుండీలో 215 గ్రాముల బంగారం , 1080 గ్రాముల వెండి , విదేశీ కరెన్సీ 226 యుఎస్ డాలర్లు , 20 ఆస్ట్రేలియన్ డాలర్లు , 30 యుఏఈ ధిరమ్స్ , 100 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఓమన్ , 10 యూరోస్ , సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బెమరిన్ 1 / 2 దినార్ లు ఉన్నాయి . సీనియర్ అసిస్టెంట్ ఉప-కమీషనర్ పర్యవేక్షణలో ఇలేక్కిప్పు జరుగింది . లెక్కింపులో ఆలయ కార్యనిర్వహణాధికారి కుమారి సునీత , ఆలయ ప్రధానార్చకులు భద్రకాళీ శేషు , సిబ్బంది , లక్ష్మివెంకటేశ్వర సేవా సమితి 96 మంది భక్తులు , విజయవాడ నుండి 32 మంది భక్తులు మొత్తం 128 మంది భక్తులు పాల్గొన్నారు …