ప్రేమకు ఎండ్ పాయింట్ పెళ్లి అని కొందరు భావిస్తుంటారు. ప్రేమించిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్న ఆనందం మరొకటి లేదు. జీవితంలో ఏదో దక్కిందన్న సంతోషం ఉంటుంది. ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నామన్న సంతృప్తి ఉంటుంది. నిజంగా ఆ సంసారం హాయిగా సాగిపోతే వాళ్లంతా మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్స్ ఈ లోకంలోనే ఉండరు. కానీ తాము ఒకటి తలిస్తే, దైవం మరొకటి చేసిందని అనేక మంది జీవితాలను చూస్తుంటే నిజమే అనిపించకమానదు. ఊహించని విధంగా హాయిగా సాగిపోతున్న సంసారంలో చిన్న చిన్న సమస్యలు, కలతలు ఏర్పడితే..? అవే ఒక నిండు ప్రాణాన్ని బలిగొంటే ఆ బాధ వర్ణనాతీతం. ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి చూశారా ఎంత అందంగా ఉందో కానీ చిన్న కారణానికి పెద్ద నిర్ణయం తీసుకుంది.

రాత్రి భోజనం చేసుకుని పడుకున్న కోడలు పొద్దున్న తలుపు ఎంత కొట్టినా తీయకపోయే సరికి అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కిటికీలో నుండి వచ్చి చూడగా ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమె పుట్టింటికి సమాచారం అందించారు. ఇంతకు ఆమె ఎందుకు ఇలా చేసిందంటే పూర్తి వివరాల్లోకి వెళితే: కర్ణాటకకు చెందిన మల్నాడుకు చెందిన షమిత విద్యార్థి సోమేశ్వర ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత మార్చిలో వీరి వివాహం జరిగింది. హాయిగా కాపురం సాగిపోతుంది. భర్త రాత్రి విధుల నిమిత్తం డ్యూటీకి వెళ్లగా అత్త షమితను డిన్నర్ చేసి పడుకోమని చెప్పగా ఆమె అలాగే చేసి తన గదిలోకి వెళ్లి పడుకుంది.

ఉదయం తలుపులు తట్టినా తీయకపోవడంతో కిటీకీలో నుండి చూడగా షమిత ఉరి కొయ్యకు వేలాడుతుంది. ఆమె తల్లిదండ్రులు వచ్చాక తలుపులు పగుల గొట్టి చూడగా మృతదేహం వద్ద సూసైడ్ నోట్ ఉంది. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాసి ఉందని తెలుస్తోంది. ఈ కారణంగానే ఎంతో ప్రేమించిన భర్తను వదిలేసి ఆమె అనంత లోకాలకు తిరిగి వెళ్లిపోయింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. పోస్టు మార్టం నిమిత్తం షమిత మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆమె ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు.