భార్యను, కుమార్తెలను వ్యభిచారులు అంటూ దూషించిన భర్తను భార్య చంపేసినా అది హత్యా నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. వివరాలిలా ఉన్నాయి. తమిళణాడుకు చెందిన ఒక మహాళను ఆమె కుమార్తెను భర్త వ్యభిచారిణులు అంటూ దూషించాడు. దీంతో ఆగ్రహం పట్టలేని ఆమె తన భర్తను హత్య చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు ఈ కేసులో ముద్దాయిలను హత్యా నేరం కింద కాకుండా కల్పబుల్ హోమిసైడ్ కింద శిక్షించాలని తీర్పు ఇచ్చింది. అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ఆ మహిళను భర్త వ్యభిచారి అని దూషించాడు.

దీంతో కోపం పట్టలేని ఆమె భర్తను, మరో వ్యక్తితో కలిసి హత్య చేసి మృతదేహాన్ని దహనం చేసింది.ఈ ఘటన జరిగిన నలభై రోజుల తరువాత పోలీసులు మృతదేహం అవశేషాలను కనుగొని హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. ట్రయల్ కోర్టు, మద్రాస్ హైకోర్టు కూడా హత్యానేరం కింద శిక్ష విధించాయి. అయితే నిందితురాలు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ మోహన్, ఎం.శంతనాగౌడ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారించింది. భారత సమాజంలో ఏ మహిళా కూడా వ్యభిచారి అని ముద్ర వేయడాన్ని సహించలేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. నిందితురాలికి హత్యా నేరం కింద కాకుండా కల్పబుల్ హోమోసైడ్ కింద పది సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.