భర్త కళ్ల ముందే భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు దుండగులు. ఇంటికి వెళ్తున్న దంపతులను అడ్డగించి ఈ దారుణానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే అమ్రోహ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి భార్యతో కలిసి చాంద్‌పూర్‌లోని ఆసుపత్రికి వెళ్లి అక్కడి నుంచి రాత్రి వేళ తమ స్వస్థలానికి తిరిగివస్తున్నాడు. మార్గమధ్యలో నలుగురు దుండగులు వారిని అడ్డగించారు. మహిళను చెరబట్టి ఆమె భర్తపై దాడి చేశారు. అనంతరం మహిళపై లైంగిక దాడికి పాల్పడుతుండగా, భర్త వారిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో దుండగులు భర్తపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అరుపులు వినబడడంతో సమీప గ్రామస్తులు సంఘటన స్థలానికి వచ్చి దుండగులపై దాడి చేశారు. ఈ క్రమంలో వారు అక్కడి నుంచి పారిపోయారు. బాధిత మహిళను, ఆమె భర్తను ఆసుపత్రికి తరలించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.