భర్త తనతో శృంగారం చెయ్యలేదని తీవ్రంగా కొట్టింది ఓ భార్య. తాగిన మైకంలో భర్తను దారుణంగా కోట్టడమేగాక ఏకంగా భర్తపైనే పోలీసులకు ఫిర్యాదు ఫోన్ చేసి చెప్పింది. ఈ విచిత్ర ఘటన అమెరికాలోని ఒహియా రాష్ట్రంలో జరిగింది. గత శనివారం అర్థరాత్రి పోలీసులకు ఎరికా యోడర్ అనే మహిళ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తనపై భర్త దాడి చేస్తున్నాడని, కాపాడాలని వేడుకోవడంతో పోలీసులు హుటాహుటిన ఆ ఇంటికి చేరుకున్నారు. అయితే ఆ మహిళపై ఒంటిపై ఎలాంటి గాయాలు గాని భర్త కొట్టినట్లు ఆనవాలు గాని కనిపించక పోవడంతో పోలీసులకు బాగా అనుమానం వచ్చింది. అయితే తనకు ఇద్దరు పిల్లలు ఉన్నరు. వారిని పోలీసులు విచారించగా తన త్లి చెప్పింది మొత్తం పచ్చి అబద్ధమని, తనే తమ తండ్రిపై దాడి చేసినట్లు చెప్పారు.

Advertisement

దీంతో పోలీసులు భర్తను విచారించగా అసలు విషయం చెప్పాడు. తన భార్య మద్యం మత్తులో వచ్చిశృంగారం చెయ్యాలని పట్టుపడుతుంది ఆమె మద్యం మత్తులో ఉంది అని తెలిసి నిరాకారించినందుకు నన్ను చెప్పలేని పదజాలంతో తిడుతూ కొట్టిందని చెప్పాడు. ఆమె పోరు పడలేక తాను వేరే గదిలోకి వెళ్లి తలుపు వేసుకోవడంతో పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మహిళ మాటతీరు, కళ్లు చూసిన తర్వాత ఆమె మత్తులో ఉందని గ్రహించిన పోలీసులు భర్త ఫిర్యాదు ఆధారంగా ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.