‌తలాక్‌ ఇస్తానంటూ భర్త వేధించడంతో ఓ గృహిణి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తన పిల్లలతో సహా ట్యాంక్‌బండ్‌లో దూకేందుకు యత్నించింది. పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి నీటిలోకి దూకేందుకు వెళ్తున్న ఆమెను స్థానికులు అడ్డుకున్నారు. వారి సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న లేక్‌ పోలీసులు మహిళలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. కాగా గత కొద్దిరోజులుగా తలాక్‌​ ఇస్తానంటూ తన భర్త తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె పోలీసుల వద్ద వాపోయింది. ఆత్మహత్యయత్నానికి యత్నించిన మహిళను నగరంలోని టోలీచౌక్‌ ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.