భర్త కళ్ల ముందే భార్యను ఒక మంత్రగాడు అత్యచారం చేసిన ఘోర సంఘటన ఫలక్‌నుమా పోలీసు స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట ప్రాంతంలోని సదత్ నగర్‌లో సంభవించింది. తన భార్యకు దెయ్యం పట్టిందని అనుమానించిన ఒక వ్యక్తి తన భార్యను మూసా బావజీర్ అనే మంత్రగాడి వద్దకు తీసుకెళ్లాడు. ఆ మంత్రగాడు ఆదేశించిన మేరకు ఆ భర్త తన భార్య దుస్తులను బలవంతంగా తొలగించాడు.

Advertisement

ఆ తర్వాత ఆ భర్త సమక్షంలోనే మంత్రగాడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన 2018 డిసెంబర్ 24న జరిగింది. కాగా, ఆ భర్త మరోసారి తన భార్యను అదే మంత్రగాడి వద్దకు తీసుకెళ్లగా ఆ మంత్రగాడి మిత్రుడైన షేక్ మొహసిన్ ఆమెను వివస్త్రను చేయాలని భర్తను ఆదేశించాడు. దీంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించి అక్కడ నుంచి బయటపడింది. ఈ సంఘటన తర్వాత ఆమెను భర్త, ఆమె అత్తమామలు ఇంటి నుంచి గెంటివేశారు.

దీంతో ఆమె తన పుట్టింటికి చేరుకుంది. జులై 18న ఓమన్ నుంచి ఆమె తండ్రి హైదరాబాద్ చేరుకోవడంతో తనపై జరిగిన అత్యాచారాన్ని ఆమె తన తండ్రికి తెలిపింది. వెంటనే ఆమె తండ్రి ఈ సంఘటనపై ఫలక్‌నుమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.