భళా భద్రకాళి !! అన్నట్లుగా భద్రకాళి ట్యాంకుబండ్ సుంద రీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి . హైదరాబాద్ లోని హుసేన్ సాగర్ ట్యాంకుబండ్ తరహాలో ఓరుగల్లు మహా నగరంలో భద్రకాళి ట్యాంకుబండను అభివృద్ధి చేసేందుకు అధికారులు బృహత్తర ప్రణాళికను రూపొందించారు . కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్మార్ట్ సిటీ , హృదయ్ పథ కాల గరుంచి మంజరైన దాదాపు రూ . 30 కోట్ల నిధులతో బందిపై అభివృద్ధి పనులను చేపట్టారు . ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఆర్కే బీచ్ తరహాలో ఓరుగల్లు భద్రకాళి చెరువు పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దనున్నారు . బీచ్తో పాటు రోడ్డు మార్గంలో తీర్చిదిద్దిన సుందరమైన కళాకృతులకు ఇక్కడ ప్రాణం పోస్తున్నారు . పంట 6రోడ్లోని ఆర్టీసీ టైర్ కంపెనీ నుంచి గాయత్రి అమ్మవారి దేవాలయం ముందు వరకు తొలి విడతలో దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో భద్రకాళి చెరువుకట్టను ట్యాంక్ బండ్ గ అభివృద్ధి చేస్తున్నారు . రాతి స్తంభాలు , స్వాగత తోరణాలు , పాతవే ఆధునాత మైన లైటింగ్ పనులు చేస్తున్నారు . గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పర్యవేక్షణలో ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి .

ఇప్పటికే భద్రకాళి ట్యాంకబండ్ డిజైన్ కు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది . మరో నాలుగైదు నెలల్లో తొలి విడత పనులు పూర్తి చేయా లనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు . అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది దసరా పండగ నాటికే సుందరమైన ట్యాంక్ బండ్ ఆవిష్కృతం కానుంది