ఈ రోజు సాయంత్రం 5 గంటలకు 382 అపరాజిత కాలనీ, అమీర్ పేట్ డాక్టర్ కె. ఎ.ఆల్ పాల్ ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్, ప్రెస్ మీట్ లో డాక్టర్ కె. ఎ.ఆల్ పాల్ గారు జాతీయ సంక్షోభం అయిన టెర్రరిజం గురించి, భారత్ పాకిస్తాన్ సంబంధాల గురించి మాట్లాడతారు.

Advertisement

డాక్టర్ కె.ఎల్. పాల్ గారు మరియు పాకిస్తాన్ కి వెళ్లడానికి మరియు 2002 జూన్లో ఏ విధంగా అయితే భారత్ పాకిస్తాన్ మధ్య విజయవంతంగా శాంతి చర్చలు చేసారో, అలానే ఇపుడు కూడా శాంతి చర్చలు చేయాలని నిశ్చయంతో, ప్రధానమంత్రి మోడికి ఆయన తన దగ్గరి స్నేహితుడు మరియు కేంద్ర మంత్రితో మాట్లాడి విజ్ఞప్తి చేశారు.

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మరియు భారత ప్రధానమంత్రి మోడితో డాక్టర్ కె. ఎ. పాల్ ఇప్పటికే చర్చల్లో ఉన్నారు. తన మంచి స్నేహితుడు మరియు తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ మరియు భారతీయ ప్రధానమంత్రి వాజ్ పేయి తో శాంతి చర్చలు జరిపి 2003 లో నోబుల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ సంవత్సరం కూడా బిజెపి ప్రభుత్వం ఈ ఏడాది డాక్టర్. కే. ఏ. పాల్ గారిని నోబుల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది.. అని ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ పత్రిక ప్రకటన విడుదల చేసింది..