షూటింగ్ లో ‘ఇలవేణి’ ప్రతిభ అపూర్వం…

భారత షూటర్‌ ఇలవేణి వలరివన్‌ ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌లో స్వర్ణ పతకం సాధించింది. రియో డి జెనిరో వేదికగా జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఆమె భారత్‌కు పతకాన్ని అందించింది. తద్వారా షూటింగ్‌ ప్రపంచ కప్‌ సిరీస్‌లో అంజలీ భగవత్‌, అపూర్వి చండేలా తర్వాత ఈ ఘనత సాధించిన మూడో మహిళా షూటర్‌గా నిలిచింది. తమిళనాడు రాష్ట్రం కడలూరుకి చెందిన ఈ అమ్మాయి, సీనియర్‌ క్రీడాకారిణిగా బరిలో దిగిన రోజే స్వర్ణం సొంతం చేసుకోవడం విశేషం. బుధవారం జరిగిన పోటీలో 251.7 పాయింట్లు సాధించిన ఇలవేణి ప్రథమ స్థానంలో నిలిచి, భారత కీర్తిని మరింత ఇనుమడింపచేసింది.