భారీగా తగ్గినా ఐ ఫోన్ ధరలు

Advertisement

ఐఫోన్ ప్రియులకు శుభవార్త .. భారీగా తగ్గినా ఐ ఫోన్ ధరలు

భారీ తెరలతో విపణిలోకి ఐఫోన్‌ X-R‌, X-S ‌, Xs-Max ‌లను యాపిల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలిసారి డ్యుయల్‌ సిమ్‌, డ్యుయల్‌ స్టాండ్‌ బైతో వీటిని ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విపణిలో ఉన్న ఐఫోన్‌ టెన్‌, ఐఫోన్‌ 8ప్లస్‌ సహా పలు మొబైల్‌ ధరలను తగ్గిస్తున్నట్లు యాపిల్‌ ప్రకటించింది. త్వరలోనే ఈ ధరలను భారత్‌లోనూ అమలు చేయనుంది.

ఐఫోన్‌ 6ఎస్‌

యాపిల్‌ ఐఫోన్‌ 6ఎస్‌ సిరీస్‌లో మొబైళ్ల ధరను భారీగా తగ్గించింది. ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ 32జీబీ మోడల్‌ ధర రూ.52,240 ఉండగా, ఇప్పుడు రూ.34,900లకే లభించనుంది.

ఇక ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ 128జీబీ వేరియంట్‌ ధర రూ.61,450 నుంచి రూ.44,900కు తగ్గించింది. ఐఫోన్‌ 6ఎస్‌ బేసిక్‌ వేరియంట్‌ రూ.29,900 ప్రారంభమవుతుండగా, హైఎండ్‌ మొబైల్‌ ధరను రూ.39,900గా ఉంది.

యాపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌

ఐఫోన్‌ ఎక్స్‌ 64జీబీ వేరియంట్‌ ధర ప్రస్తుతం రూ.95,390 ఉండగా, రూ.91,900 నుంచి ప్రారంభంకానుంది. టాప్‌ ఎండ్‌ 256జీబీ వేరియంట్‌ ధర రూ.1,08,930 ఉండగా, ఇక నుంచి రూ.1,06,900 లభించనుంది.

యాపిల్‌ ఐఫోన్‌ 8

ఐఫోన్‌ 8 ప్లస్‌ ధరను సైతం యాపిల్‌ తగ్గించింది. 64జీబీ ఇక నుంచి రూ.69,900లకే లభించనుంది. గతంలో దీని ధర రూ.77,560గా ఉండేది. ఐఫోన్‌8 ప్లస్‌ 256జీబీ వేరియంట్‌ ధరను రూ.91,110 నుంచి రూ.84,900లకు తగ్గించింది.
ఐఫోన్‌ 8 64జీబీ రూ.67,940 ఉండగా, ఇప్పుడు రూ.59,900లకే లభించనుంది. ఐఫోన్‌ 8 టాప్‌ ఎండ్‌ మొబైల్‌ ధరను రూ.81,500 నుంచి రూ.74,900లకు తగ్గించింది.

యాపిల్‌ ఐఫోన్‌7

ఐఫోన్‌ 7ప్లస్‌ 32జీబీ, 128జీబీ వేరియంట్‌ ధరలు వరుసగా రూ.49,900, రూ.59,900లకే లభించనున్నాయి. ఇక ఐఫోన్‌ 7 32జీబీ వేరియంట్‌ను రూ.52,370 నుంచి రూ.39,900లకు తగ్గించింది. అలాగే ఐఫోన్‌7 128జీబీ ధరను కూడా రూ.61,560 నుంచి రూ.49,900లకు తగ్గించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here