హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో హిమాయత్‌నగర్‌లోని లింగాపూర్‌ హౌస్ కాంప్లెస్‌లో చైల్డ్ క్లీనిక్ నిర్వహిస్తున్నాడు డాక్టర్ మైఖేల్ అరాన్హా. అతని వద్దకు చికిత్స నిమిత్తం డిసెంబర్ 28న రాత్రి 7 గంటల సమయంలో భార్యాభర్తలు, తమ కుమారుడిని తీసుకుని వచ్చారు. తాను పక్కన ఉండగా. తనతో ఒక్క మాట మాట్లాడకుండా భార్యతోనే మాట్లాడుతుండడం భర్త గులాం ముస్తఫాకు కోపం తెప్పించింది.

మందులు ఇచ్చిన తర్వాత జాగ్రత్తలు, సూచనలు కూడా తల్లికి మాత్రమే చెప్పడంతో ఆ కోపం నషాలానికి ఎక్కింది. అంతే, భార్యనూ, కుమారుడిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయిన అతను, ఇద్దరినీ ఇంట్లో దింపేసి, అదే రోజు రాత్రి 9.10 నిమిషాలకు తిరిగి క్లినిక్‌కు వచ్చాడు. స్నేహితుడితో కలిసి వచ్చి డాక్టర్‌పై దాడి చేశాడు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ మైఖేల్ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.