భార్యను జూదంలో తాకట్టు పెట్టిన భర్త! అతడు ఓడిపోవడంతో భార్యపై సాముహిక..

ఓ ప్రబుద్ధుడు మద్యానికి బానిసై కట్టుకున్న భార్యనే జూదంలో పందెం కట్టాడు. అందులో అతడు ఓడిపోవడంతో ఆ జూదంలో పాల్గొన్నవారు భార్యపై సాముహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ జుగుప్సకరమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ తర్వాత బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా వారు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. చివరకు ఆమె కోర్టును ఆశ్రయించడంతో ఆమె భర్త, అతని మిత్రులపై కేసు నమోదుచేశారు. ఓ వ్యక్తితో జూదం ఆడటానికి అతని స్నేహితుడైన అరుణ్, బంధువు అనిల్‌ తరుచూ వస్తూపోతుండేవారు.

ఈ క్రమంలో సదరు వ్యక్తి జూదంలో డబ్బులు పోగొట్టుకొని తన భార్యను పందెంగా పెట్టాడు. మళ్లీ ఓడిపోవడంతో అతని బంధువు, మిత్రుడు బాధితురాలిపై సాముహిక అత్యాచారం జరిపారు. సంఘటన జరిగాక బాధితురాలు తన మేనమామ ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత భర్త ఆమె వద్దకు వెళ్లి తప్పైపోయిందంటూ క్షమించమని బతిమలాడాడు. తిరిగి ఇంటికి తీసుకొస్తూ మార్గమధ్యంలో కారును ఆపి మళ్లీ అనిల్‌, అరుణ్‌ను ఆమెపై మళ్లీ అత్యాచారం చేసేందుకు ఉసిగొల్పాడు. దీంతో సదరు బాధితురాలు జఫరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. చివరకు ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు సామూహిక అత్యాచారం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here