భార్యను తాగమని , సెక్సీగా ఉండమని శాడిస్ట్ భర్త నీచం.

అమెరికా అల్లుడని తల్లితండ్రి , ఎన్నారై భర్త అని భార్య మురిసిపోయి రెండేళ్లు కాకముందే అమ్మాయి అమ్మ నాన్నల దగ్గరకు తిరిగొచ్చిన రెండురోజుల్లో ఆత్మహత్య చేసుకుంది. పెళ్ళైన తరువాత అమెరికాలో . అనూహ్యంగా అల్లుడి వేధింపులకు తమ కూతురు బలి కావడంతో తల్లడిల్లిపోయారు.
అమెరికాలో ఆ దుర్మార్గపు భర్త అసలు స్వరూపం బయట పడింది. తనను నమ్మి వచ్చిన భార్యకు తన పైశాచికత్వంతో నరకం చూపాడు. స్నేహితులతో జల్సాలు చేయడం, మద్యం, మాదకద్రవ్యాల సేవనం అతడి దినచర్య. భార్యను సైతం ఆ రొంపిలోకి దింపాలని శతవిధాలా ప్రయత్నించాడు. తనతో కలసి తాగాలని, పేకాడాలని నిత్యం వేధించేవాడు. అతని ఆగడాలు భరించలేక రెండు రోజుల క్రితం అమెరికా నుంచి పుట్టింటికి వచ్చిన ఆ ఇల్లాలు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నేరేడ్‌మెట్‌ కాకతీయనగర్‌లో ఉంటున్న.

20ఏళ్లుగా వాళ్లు సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. చిన్న కూతురు మాధురి(23)ని బీటెక్‌ వరకు చదివించారు. ఒంగోలుకు చెందిన సుబ్బులు, వెంకటేశ్వర్లు జీడిమెట్ల షాపూర్‌నగర్‌లో ఉంటున్నారు. వీరి కుమారుడు కోటేశ్వరరావు(27) అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. మధ్యవర్తుల ద్వారా సంబంధం కుదరడంతో కోటేశ్వరరావుకు తమ కుమార్తె మాధురిని ఇచ్చి 2016 నవంబరు 9న ఆమె తల్లిదండ్రులు వివాహం చేశారు. అనంతరం మాధురిని కోటేశ్వరరావు అమెరికాకు తీసుకెళ్లాడు. అక్కడ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. విసిగిపోయిన మాధురి గతంలోనే పుట్టింటికి రాగా, ఇరు కుటుంబాల పెద్దలు నచ్చజెప్పి అమెరికాకు పంపారు. అయినా కోటేశ్వరరావులో మార్పు రాలేదు. భార్యను లోదుస్తులు ధరించి, మద్యం తాగాలని, పేకాట ఆడాలని బలవంతం చేసేవాడు. మాట వినకపోతే చితకబాదేవాడు.

అతడు పెట్టే చిత్రహింసలు భరించలేక మాధురి ఈనెల 11న తిరిగి పుట్టింటికి వచ్చింది. జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు వివరించింది. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మాధురి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీఆసుపత్రికి తరలించారు.