కుటుంబ కలహాలతో భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన సంగెం మండలంలోని పెద్దతండా గ్రామపంచాయతీ అనుబంధ మూల తండాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మూలతండాకు చెందిన సపావట్‌ కవిత(21)కి సపావట్‌ రవితో వివాహం జరిగింది. కొంత కాలంగా అతను తరచూ గొడవ పడుతూ శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇటీవల తల వెంట్రుకలు కత్తిరించి తీవ్రంగా హింసించాడు. గొడవలు తీవ్రమై శ‌నివారం గొడ్డలితో దాడి చేశాడు. కవిత చేతిని అడ్డుగా పెట్టింది. రెండు వేళ్లు తెగిపోయాయి. తీవ్రగాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన కవిత ఆదివారం సంగెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.