సంగెం: భార్యాభర్తల గొడవ విషయంలో ఎస్సై తనను ఇష్టారీతిన దూషించడానికి తోడు కొట్టడంతో.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వరంగల్ రూరల్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ఇజ్జగిరి కార్తీక్ తన భార్య నాగరాణికి మధ్య మనస్పర్థలు ఉండి కొంత కాలంగా వేరువేరుగా ఉంటున్నారు. ఈ విషయంలో సంగెం ఎస్సై నాగరాజు మంగళవారం ఉదయం 9 గంటలకు కార్తీక్ ను స్టేషన్ పిలిపించారు. ఇష్టారీతిన తిట్టడానికి తోడు బూటు కాలుతో తన్నాడు. ఎంత బతిమిలాడిన వినకుండా రాత్రి 9 గంటల వరకు స్టేషన్ లోనే నిర్బంధించారు. ఆపై బుధవారం ఉదయం మళ్ళీ రావాలని చెబుతూ ఇంటికి పంపించారు. దీనిని అవమానంగా భావించడానికి తోడు ఎస్సై మళ్ళీ కొడుతాడానే భయంతో బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కార్తీక్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు నెలల క్రితం ఇదే విషయంలో..బాధితుల వద్ద రూ.10 వేలు వసూలు చేసినట్టు చెబుతున్నారు. కాగా, తమ కుమారుడి చావుకు ఎస్సై కారణం అంటూ భాదితులు వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్సై నాగరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు…