భార్య వివాహేతర సంబధం పెట్టుకుందనే అనుమానంతోనే విడాకులు తీసుకునే వారిని చూసి ఉంటాం. కానీ ఇదో విచిత్ర సంఘటన. తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకోలేదన్న కోపంతో తలాక్ చెప్పాడు ఓ వ్యక్తి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రిపుల్ తలాక్ నేరంగా పరిగణిస్తూ చట్టం చేసినా ఇటువంటి చర్యకు పాల్పడటం మరో విశేషం.
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన అత్తింటి వారు అదనపు కట్నం కోసం తరుచూ వేధిస్తున్నారని ఆరోపించింది.

Advertisement

కట్నం తేలేదనేే కోపంతో తన భర్త ఎప్పుడూ కొడుతూ చిత్రహింసలు పెడుతున్నాడని తెలిపింది. అంతటితో ఆగకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నాడని పేర్కొంది. అతని బాధలు భరించలేక తాను పుట్టింటికి వెళ్లిపోయినట్టు వెల్లడించింది. ఆ కోపంతోనే తనకు తలాక్ చెప్పాడని తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.