సుభాష్ ఇస్లావత్ అనే కానిస్టేబుల్ పఠాన్ చేరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. సుభాష్ కు సుకన్యతో మ్యారేజ్ అయ్యింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. అయితే గత కొద్ది రోజులుగా భార్యను వేధించడం ప్రారంభించాడు. అది కాస్త ఎక్కువ కావడంతో సుకన్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుభాష్ పై వేధింపుల కేసు నమోదైంది. సుభాష్ మొదటి భార్య కు విడాకులు ఇవ్వకుండానే అమీన్ పూర్ వందనపురి కాలనీ లో మరో మహిళతో రెండవ కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న భార్య సుకన్య, సుభాష్ ఇంటిముందు న్యాయం కోసం బైఠాయించింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తీస్కెళ్లారు. న్యాయం చేయాలంటూ బాధితురాలి పిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.