భార్య తప్పుడు పని గూగుల్ కెమెరా పట్టించింది.

తన భార్య వేరే వ్యక్తితో ఉన్న విషయాన్ని పసిగట్టిన ఓ భర్త ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. అయితే ఈ బండారం మాత్రం చాలా వెరైటీగా బయటపడింది. గూగుల్ తీసుకొచ్చిన స్ట్రీట్ వ్యూ ఫొటోలు భార్య బండారాన్ని బయటపెట్టాయి. అది కూడా ఐదు సంవత్సరాలు తరవాత.
పెరూ దేశానికి చెందిన ఓ వ్యక్తి రాజధాని లిమాలో పేరుపొందిన బ్రిడ్జిని చేరుకోవడానికి గూగుల్ మ్యాప్స్‌లో శోధిస్తున్నాడు.

అయితే గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫొటోల్లో అతడికి ఓ మహిళ కనిపించింది. ఆ ఫొటోను చూస్తుంటే ఆమె అతడికి బాగా తెలిసిన వ్యక్తిలా కనిపించింది. వైట్‌ టాప్‌, హీల్స్‌ ధరించిన ఆమె ఓ వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉన్నట్లు ఆ ఫొటోలు చూపిస్తున్నాయి. అయితే ఆ దుస్తులు చాలా సందర్భాల్లో తన భార్య ధరించినవాటిలాగే అనిపించాయి సదరు వ్యక్తికి. ఆ ఫొటోను చాలా దగ్గరగా గమనించగా ఆమె ఎవరో ఇట్టే గుర్తుపట్టేశాడు. ఆమె తన భార్యే అని పసిగట్టేశాడు. ఆ ఫొటోలను గూగుల్ కెమెరా కారు ఓ బ్రిడ్జి వద్ద 2013లో తీసింది.

వెంటనే ఆధారాలతో సహా వాటిని బయటపెట్టడంతో ఆమె తన తప్పును ఒప్పుకోవాల్సి వచ్చింది. పేరు చెప్పని ఆ జంట తరవాత విడాకులు తీసుకున్నట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.