భార్య ప్రవర్తనతో విసుగుచెంది : ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్

భార్య భర్తల మధ్య నెలకొన్న మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. భార్య ప్రవర్తనపై పలుమార్లు అతడు మందలించాడు. అయినా మార్పు రాకపోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాలు కామారెడ్డికి చెందిన ప్రశాంత్ కు 2014లో వరంగల్ కు చెందిన పావనితో వివాహం జరిగింది. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ శ్రీనగర్ కాలనీలో నివసిస్తున్నారు. కొంతకాలంగా పిల్లలు కలుగలేదు. దీంతో క్రమంగా వారి మధ్య కలహాలు, మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ప్రశాంత్ తన భార్య మరోకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని గుర్తించి, మందలించాడు. ఆమె తీరు మార్చు కోకపోగా ప్రశాంత్ నే దూషించేది, చచ్చిపో అంటూ అతడిని వేధించింది. దీంతో తీవ్ర ఆవేదన చెందిన ప్రశాంత్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. తన భార్య మరోకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చాలా సార్లు మందలించినా ప్రవర్తనలో మార్పు రాలేదు. తనను చచ్చిపో అంటూ దూషించిందని సూసైడ్ నోట్ లో తెలిపాడు.

మృతుడి తండ్రి లక్ష్మీనరసయ్య ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.