ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూడాలని బలవంతం చేస్తున్న మహిళా డాక్టర్‌తో కాపురం చేయలేనని టెక్కీ భర్త తేల్చిచెప్పాడు. ఈ సంఘటన బెంగళూరులో వెలుగుచూసింది..

Advertisement

వివరాలు: కోల్‌కతాకు చెందిన మహిళా వైద్యురాలు (32), ఉత్తరప్రదేశ్‌ కు చెందిన 33 ఏళ్ల సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఓ మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌ ద్వారా సంబంధం కుదుర్చుకుని 2018లో పెళ్లి చేసుకుని బెంగళూరులో కాపురం పెట్టారు. కొన్నిరోజులకే భార్య ప్రవర్తన అతనికి విరక్తి కలిగించింది. పోర్న్‌ వీడియోలను చూడాలని ఆమె భర్తను ఒత్తిడి చేసేది. భర్త మాత్రం తనకు అలాంటి అలవాటు లేదని చెప్పేవాడు. ఆమె ఒత్తిడి తట్టుకోలేక వీడియోలను చూడడం మొదలుపెట్టాడు.
ఒకరోజు భార్య మొబైల్‌లో ఆమె అశ్లీల వీడియోను చూసి కంగుతిన్నాడు. దీనిపై భార్యను అడగ్గా అతను తన మాజీ ప్రియుడని, అన్నీ మరచిపోదామని నచ్చజెప్పింది.

భర్త అనుమానంతో ఇంటర్నెట్‌లో వెతగ్గా అటువంటి వీడియోలు మరికొన్ని బయటపడ్డాయి. భార్యను నిలదీయగా ఎలా అప్‌లోడ్‌ అయింది అనేది తెలియదని చెప్పింది. భార్య ప్రవర్తన నచ్చక అతడు విడిగా ఉంటున్నాడు. దీంతో భార్య నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలోని కుటుంబ సమస్యల పరిష్కార కేంద్రాన్ని సంప్రదించింది. భర్త తనను ఇంటికి తీసుకెళ్లడం లేదని ఆరోపించింది. దీంతో కేంద్రం సీనియర్‌ సలహాదారు బీఎస్‌.సరస్వతి దంపతులిద్దరినీ పిలిపించి మాట్లాడారు. భార్య వ్యవహారం మొత్తం పూసగుచ్చినట్లు చెప్పాడు. భార్య మాత్రం గతంలో జరిగింది మరచిపోయి భర్తతో కలిసి ఉంటానని చెప్పింది. కలిసిమెలిసి ఉండాలని కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు.
.