కట్టుకున్న భర్తె ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. ఎవరైనా భార్య జోలికి వచ్చినా ! ఆమెను బెదిరించి, ఇబ్బంది పెట్టాలని చూసినా కాపాడాల్సిందిపోయి !! తానే ఆమెను రకరకాలుగా వేధించడం మొదలుపెట్టాడు. ఆమె స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. ఈ సంఘటన శ్రీనివాసరావుపేటలో చోటుచేసుకుంది…

పూర్తి వివరాలు: శ్రీనివాసరావుపేటకు చెందిన దంపతులు తమ పెద్ద కుమార్తెను తాడి కొండకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి 2017లో వివాహం జరిపించారు. కాగా, పెళ్లిన కొద్ది రోజులు భార్యతో ప్రేమగా ఉన్న వ్యక్తి తర్వాత, తర్వాత తనలోని రాక్షసుడిని నిద్రలేపాడు . అదనపు కట్నం కావాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం ఇవ్వడానికి ఆమె అంగీకరిచకపోవడంతో, బ్లాక్ మెయిల్ కి దిగాడు..

భార్య స్నానం చేస్తున్న క్రమంలో రహస్యంగా వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియో చూపించి , అదనంగా కట్నం తేకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అతని వేధింపులు రోజూ తీవ్రతరం కావడంతో , సదరు మహిళ తన తల్లి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది . ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…