కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి భార్య స్నేహితురాలిపై అత్యాచారం జరిపి తల్లిని చేసిన వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఊత్తుకోటకు చెందిన సిలంబరసన్‌కు కవర్‌పేటకు చెందిన షర్మిలతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. వీరిద్దరూ కిలికోడి గ్రామంలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో షర్మిల స్నేహితురాలైన ఓ యువతి తరుచూ వారింటికి వచ్చేది. దీంతో సిలంబరసన్‌ ఆమెపై కన్నేశాడు. ఆమెపై కన్నేసిన సిలంబరసన్‌ భార్య లేని సమయంలో ఇంటికి వచ్చిన ఆమె స్నేహితురాలికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి ఆమెను బెదిరించి లొంగదీసుకుని పలుమార్లు లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. దీంతో గర్భం దాల్చిన బాధితురాలు గత 21వ తేదీన పొన్నేరి ఆస్పత్రిలో మగశిశువును ప్రసవించింది.

తన బతుకు నాశనం కావడానికి కారణమైన సిలంబరసన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేశారు.