భూపాలపల్లి బరిలో ఫిజియో థెరపిస్
తెరాస తర్వాత బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించడం మొదలుపెట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖరారైన ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరైన కీర్తి రెడ్డి భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారితో పోటీ పడతారు. హన్మకొండ మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోడలైన కీర్తి రెడ్డి ఫిజియోథెరపీలో బ్యాచిలర్స్ పట్టా పొందారు. 2014లో బీజేపీలో చేరి చురుగ్గా పనిచేస్తున్నారు. టికెట్ ను అధికారికంగా ప్రకటించకముందే ఒక విడత నియోజకవర్గంలో ప్రచారం పూర్తి చేశారు. జంగారెడ్డి రాజకీయ వారసురాలిగానే కాకుండా చురుకైన మహిళా నేతగా గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో భూపాలపల్లిలో బీజేపీ మూడో స్థానంలో ఉన్నప్పటికీ, దాదాపుగా కాంగ్రెస్ తో సమానంగా ఓట్లు పొందడం విశేషం.