భూ కబ్జా రుజువు చేస్తే ఉరి వేసుకుంటా

భూ కబ్జాలకు పాల్పడినట్లు తనపై తప్పుడు కేసు బనాయించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఆ కేసును రుజువు చేస్తే అసెంబ్లీ ముందు ఉరి వేసుకుంటానని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామలో ఆదివారం జరిగిన సభలో పొన్నాల మాట్లాడుతూ, తనపై తప్పుడు కేసు బనాయించడమే కాకుండా, అసెంబ్లీలో రెండున్నర గంటలపాటు తనపై చర్చించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్చ కు రాకుండా.. ఎందుకు వెనకేసుకు వస్తున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు.