మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులో పరువు హత్య జరిగింది. ప్రేమ వివాహం చేసుకుందని తల్లిదండ్రులు కూతుర్ని హత్య చేశారు. అనంతరం
వివరాల్లోకి వెళితే.. కలమడుగు గ్రామానికి చెందిన పిండి అనురాధ, అదే గ్రామానికి చెందిన అయ్యోరు లక్ష్మణ్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 3న హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. సుమారు 20 రోజుల తర్వాత దంపతులిద్దరూ కలమడుగు గ్రామంలోని లక్ష్మణ్ ఇంటికి శనివారం చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అమ్మయి కుటుంబ సభ్యులు లక్ష్మణ్ ఇంటిపై దాడిచేసి అనురాధను లాక్కెళ్లిపోయారు. శనివారం రాత్రి అనురాధ(22)ను నిర్మల్ జిల్లా మల్లాపూర్ గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి అక్కడే హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని కాల్చివేసి బూడిదను సమీపంలోని వాగులో కలిపేశారు. లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరా తీయగా ఆదివారం ఉదయం విషయం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల DCP వేణుగోపాల్ రావు, ACP గౌస్‌బాబా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనురాధ తండ్రి సత్తెన్న, తల్లి లక్ష్మిలను అదుపులోకి తీసుకొని విచారించగా కులాంతర వివాహం చేసుకోవడంతోనే అనురాధను హత్యచేసినట్లు అంగీకరించారు.