మంత్రి పదవి దక్కడంపై ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి లోనైయ్యారు. సిఎం కేసీఆర్ తన పైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కాబోయే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేసారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను అందరిని కలుపుకొని పనిచేస్తానని, జిల్లా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానని అన్నారు , కానీ లక్ష్మీపార్వతి వల్ల రాలేదని వాపోయారు. చంద్రబాబు తనని మంత్రిని చేస్తానని మాట తప్పారని, కానీ, కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని సంతోషాన్ని వెలిబుచ్చారు.