క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానని , పదవుల కోసం ఏ రోజూ తాను పాకులాడలేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు . ఆదివారం హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తనకు మంత్రి పదవి రాలేదనే బాధ లేదని , ముఖ్యమంత్రి నిర్ణయమే తనకు శిరోధార్యమని అన్నారు . కేసీఆర్ నాయకత్వంలో సైనికునిలా పనిచేస్తానని పేర్కొన్నారు . పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు ఈనెల 1న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నగరానికి వస్తున్నారని సమావేశానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చా రు . ఎంపీ ఎన్నికల్లో 16 స్థానాల్లో టీఆర్ ఎస్ విజయం సాధించడమే లక్ష్యంగా కేటీఆర్ ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు కేటీఆర్ కు కేయూసీ జంక్షన్లో పెద్ద ఎత్తున స్వాగతం పలుకను న్నట్లు వినయ్ భాస్కర్ తెలిపారు . కేయూ జంక్షన్ నుంచి సభాస్థలం ఓసిటీ వరకు 2వేల బైక్ లతో ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు . సభకు నియోజకవర్గం నుంచి 3వేల మందిని తరలిస్తామని పేర్కొన్నారు .

కేటీఆర్ సభ జయప్రదం కోసం ఈనెల 5న నిత్య బంకెట్ హాల్లో పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు . కాగా కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్నా టైన ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలో కీలక పాత్ర పోషిం చనుందని తెలిపారు . కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి , వికలాంగుల సంస్థ చైర్మన్ కె . వాసు దేవరెడ్డి ఇన్ చార్జి మేయర్ సిరాజోదీ న్ , నయీమ్ , పలి రజనీకాంత్ , దర్శన్ సింగ్ పాల్గొన్నారు .