నివేదా థామస్ చాలా కాలం తరువాత ఆమె నటించిన సినిమా త్వరలో రిలీజ్ అవుతూ ఉండడంతో ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. కేవలం ఇంటర్వ్యూలకే పరిమితం కాకుండా తమకు నచ్చినవి తింటూ ఫుడ్ చానల్స్ లో కూడా సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు సినీ నటులు. అలాగే తెలుగు ఫుడ్ ఛానల్ ఒకదానిలో శాకినీ డాకినీ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు రెజీనా కసాండ్రా, నివేదా థామస్. కాగా శివ మనస్సులో శృతి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రెజీనా. అప్పటి నుంచి టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో నటించకపోయినా మంచి ఆఫర్లు ఆమెకు దక్కాయి. ఈ మధ్య కాలంలో కాస్త బ్రేక్ ఇచ్చిన రెజీనా శాకినీ డాకినీ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించనుందిఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ అబ్బాయిల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె మాట్లాడుతూ మ్యాగీ అలాగే అబ్బాయిలు రెండు నిమిషాల్లోనే అయిపోతారు అంటూ ఆమె కామెంట్ చేసింది. ముందు ఆమె చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగ్ అర్థం కాకపోవడంతో సదరు యాంకర్ నిజమే నిజమే అని అనడంతో మీకు జోక్ అర్థం కాలేదు అనుకుంటా అంటూ ఆమె కామెంట్ చేసింది. తరువాత సదరు యాంకర్ కి బల్బ్ వెళ్ళడంతో నోరు వెళ్ళబెట్టాడు.

ఇదంతా తింటూ గమనిస్తున్న నివేదా థామస్ నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నం చేసింది.అయితే ఏ విషయంలో రెండు నిమిషాలు అనేది రెజీనా విశదీకరించి చెప్పలేదు కానీ పరోక్షంగా అబ్బాయిల శృంగారం సామర్థ్యం మీదే రెజీనా కామెంట్ చేసిందని నెటిజన్లు భావిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొరియాలో సూపర్ హిట్ గా నిలిచిన ఒక సినిమాని తెలుగులో శాకినీ డాకినీ అనే పేరుతో రీమేక్ చేశారు దర్శకుడు సుధీర్ వర్మ. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సురేష్ బాబు, సునీత తాటి ఈ సినిమాని నిర్మించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. తెలుగులో అనేక సినిమాల్లో నటించిన రెజీనా కసాండ్రా హిట్టు అందుకుని అయితే చాలా కాలమైంది. సరైన హిట్ సినిమా కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది.