మడికొండలో అగ్ని ప్రమాదం

కాజీపేట మండలం మడికొండలోని సబ్ స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. సబ్ స్టేషన్ పక్కనున్న ఖాళీ స్థలంలో పిచ్చి చెట్ల పొదల నుంచి మంటలు లేచి కొంతమేర వ్యాపించాయి. దీంతో ఆందోళన చెందిన స్థానికులు అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారమివ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పక్కనే సబ్ స్టేషన్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల వరకు మంటలు వ్యాపించి ఉంటే మరింత ప్రమాదం జరిగి ఉండేది. పక్కనే సబ్ స్టేషన్, రైస్ మిల్లు, ఓ వైపు ఆంధ్రజ్యోతి యూనిట్ కార్యాలయం ఉంది.

ఇలాంటి ప్రమాదాలు ఒకవేళ అర్ధరాత్రి జరిగి ఉంటే పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు.