మద్యం తాగవద్దని చెప్పినందుకు మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

SI సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు కడక్‌పురా ప్రాంతానికి చెందిన నాగవెల్లి లక్ష్మి (33) స్వస్థలం ఉత్తరప్రదేశ్‌. 18 సంవత్సరాల క్రితం బోయిన్‌పల్లికి చెందిన రాముతో పరిచయం ఏర్పడి అతడిని ప్రేమ వివాహం చేసుకుని బోయిన్‌పల్లిలోనే జీవనం సాగిస్తుంది.
వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కొన్ని నెలలుగా లక్ష్మి మద్యానికి బానిసైంది. నిత్యం రాత్రి సమయాల్లో కుమారుడితో మద్యం తెప్పించుకుని తా గుతుంది. దీంతో రాము మద్యం తాగొద్దని చెప్పాడు. అయినప్పటికీ కుమారుడితో మద్యం తెప్పించుకుని తాగడంతో రాము మందలించాడు.

శనివారం ఉదయం 4 గంటల ప్రాంతంలో ఇంట్లో కొద్దిగా మిగిలి ఉన్న మద్యాన్ని తాగి లక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…