మద్యం మత్తులో కారు నడిపి ఓ ఐఏఎస్‌ అధికారి నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. తిరువనంతపురంలో కారులో ఓ బ్యూరోకాట్ బీభత్సం సృష్టించి ఓ పాత్రికేయుడి మరణానికి కారణమయ్యారు. మద్యం తాగిన ఐఉస్ అధికారి శ్రీరామ్ వెంకట్రామన్ అతివేగంగా కారును డ్రైవ్ చేశారు. బైక్‌పై వస్తున్న ఓ జర్నలిస్ట్‌‌ను ఢీకొట్టారు. సిరాజ్ పత్రికలో పనిచేస్తున్న 35 ఏళ్ బషీర్ అనే జర్నలిస్ట్ కొల్లంలో ఓ అధికారిక సమావేశానికి హాజరై వస్తున్నారు. బైక్‌పై ఇంటికి తిరుగుపయనమైన సిరాజ్‌ను మార్గం మధ్యలో ఐఏఎస్ అధికారి వెంకట్రామన్ కారుతో ఢీకొట్టారు. దీంతో బషీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును వెంట్రామన్ డ్రైవ్ చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ ప్రమాదంలో ఆయనకు కూడా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. ప్రమాద సమయంలో కారులో ఓ మహిళ కూడా ఉన్నారు. కానీ, తాను కారు నడపలేదని, తన స్నేహితుడు నడిపాడని పోలీసులకు ఐఏఎస్‌ అధికారి వాంగ్మూలమిచ్చారు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం దీనికి భిన్నంగా చెబుతున్నారు. మృతిచెందిన జర్నలిస్టుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మల్లాపురంలో ఆయన కుటుంబతో నివసిస్తున్నారు….