రాష్ట్రంలో మరో యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది . ప్రత్యేకించి మహిళలకోసం ప్లాన్ చేస్తున్న ఆ యూనివర్సిటీని వరంగల్ లేదా హైదరాబాద్ లో నెలకొల్పనున్నారు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీని తిరుపతిలో , ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని విజయవాడలో ఏర్పాటు చేశారు . రాష్ట్ర విభజన తర్వాత ఈ రెండూ ఏపీ వెళ్లాయి . దీంతో తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లలోనే వరంగల్ లో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది . కానీ మహిళా వర్సిటీని మాత్రం ఏర్పాటు కాలేదు ప్రస్తుతం దీనిపై కదలిక వచ్చిం దని అంటున్నారు .

హైదరాబాద్ – వరంగల్లా ?

ఓయూ పరిధిలో నడుస్తున్న కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా వర్సిటీగా అప్ గ్రేడ్ చేసే అంశాన్ని ఏడాది క్రితం ప్రభుత్వం పరిశీలించింది . అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోఠి ఉమెన్స్ కాలేజీని సందర్శించారు . కానీ ఆ తర్వాత ఈ అంశంపై కదలిక లేదు . సోమవారం కడియం శ్రీహరి వరంగల్ లో మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో మహిళా వర్సిటీ ఏర్పాటు చేస్తాం గత ఏడాదే పెట్టాల్సింది . కానీ ఆగిపోయింది . ఈ విద్యాసంవత్సరంలో ప్రారంభిస్తాం . అది హైదరాబాదా – వరంగల్లా అనేది స్పష్టత రావాల్సి ఉంది అన్నారు . ‘ రాణి రుద్రమ ‘ పేరుతో . . వరంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని అనేక సందర్భాల్ లో CM KCR ప్రకటించారు . అందుకు తగ్గట్టుగానే ప్రముఖ విద్యాసంస్థలను వరంగల్ కు కేటాయిస్తూ వచ్చారు . కాళోజీ హెల్త్ వర్సిటీ , కేంద్ర గిరిజన యూనివర్సిటీ , వెటర్నటీ , అగ్రికల్చర్ కాలేజీలు మంజూరు చేశారు . వీటికి తోడు ప్రైవేట్ సంస్థలైన హైదరాబాద్ , ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటయ్యాయి . వరంగల్ కేంద్రంగా ‘ రాణిరుద్రమ ‘ పేరుతో మహిళావర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎన్నాళ్లుగానో ఉంది . విద్యా సంవత్సరం ప్రారంభానికి నాలుగు నెలలే ఉంది . ఈ లోగా మహిళా వర్సిటీని వరంగల్ కు మంజూరు చేయించేందుకు స్థానిక ప్రజాప్రతిని ధులు ప్రయత్నాలు చేస్తున్నారు .