భారత సైనికు‌లపై దాడిని ఖండించిన పాకిస్థాన్ స్టూడెంట్స్. అందుకు ఇక్కడి మతోన్మాదులలాగే, అక్కడి మతోన్మాదుల దాడిని ఎదుర్కోవచ్చును. ఇక్కడి మతోన్మాదులు మరో అడుగేసి వాళ్ళను ఎగతాళి చేయవచ్చు. ఇది రెండు దేశాల మధ్య యుద్ధ సమయమని, నెత్తురు పారల్సిన క్షణాలలో.. రెండు దేశల ప్రజలు ఒకరిపట్ల ఒకరు ద్వేషాన్నే కానీ, స్నేహంగా వుండకూడదని హెచ్చరించిన పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదెమొ.

Advertisement

ఉగ్రవాదానికి భారత సైనికుల వలే, పాకిస్థాన్ సైనికులు కూడా బలవుతున్నారు. ఇక్కడ చనిపోయిన సైనికుల ప్రేమలవలే, స్నేహాల వలే, కుటుంబాల వలే అక్కడ కూడా విధ్వంసం అవుతాయి. కానీ, మనంమాత్రం భారత సైనికుల వద్దనే ఆగుతున్నాం. పెషవర్ స్కూల్ మీద ఉగ్రవాదులు దాడిచేస్తే 150 మంది పసిపిల్లలు చనిపోగ మనం చిన్న కొవ్వత్తి అంటించామా.? బాల్యానికి మతం, దేశం ఉండదనే ఇంగితాన్ని కలిగి ఉన్నామా.? ఉగ్రవాదం మీద మన నిజమైన పోరాటమంటే ఆ పిల్లల కోసం ఒక్క మాటైన మాట్లాడామా.? ఇక్కడి సైనికుల వలే అక్కడ కూడా నిన్న సుమారు ఇరువైమంది చిధ్రం అయ్యారు. అందుకు ఎంత సంతోషించామొ. మన పోరాటం ఉగ్రవాదం కంటేను పాకిస్థాన్ మీద ఎక్కువైంది. అందుకే హింస పెరుగుతుంది, ప్రాణాలు తేలిపోతున్నాయి.

మన లాగ అక్కడి స్టూడెంట్స్ ఒక దేశానికి మాత్రమే పరిమితమై మాట్లాడటం లేదు. హద్దులు గీయబడ్డ దేశభక్తిని తలదన్ని నిజమైన దేశభక్తితో స్పందిస్తునవాళ్ళు వారు. పాకిస్థాన్ సైనికులతో పాటుగా భాతర సైనిక కుటుంబాల కన్నీళ్ళను కూడా గుర్తిస్తున్నారు. రెండు దేశాలలోను శాంతి కొరుతున్నవారు. నాలాగా మన దేశం వరకే కాదు.

రెండు దేశాలలోను సోదర దేశం మనలాంటి దేశమని, అక్కడ మన లాంటి మట్టి మనుషులు, కష్టజీవులు ఉంటారని అంటే రెండు దేశాలలోను దేశద్రోహమైంది. దేశద్రోహ కేసుల నమోదు. అందుకు ఉదా. జెఎన్.యు శెహ్లలాంటి వారి మీద అక్రమ కేసులు. ట్రోలింగ్.
దేశభక్తంటే పొరుగుదేశాన్ని ద్వేషించడం కాదనే ఎరుకను ఇంకెన్నాళ్ళకు తెలుసుకోగలం.??
వాళ్ళలాగ పొరుగు దేశపు కన్నీళ్లను గౌరవించడమే నిజమైన దేశభక్తి అని ఎప్పుడు తెలుసుకోగలం ??????????? ఇప్పటికైనా మెదడుతో ఆలోచిద్దాం.