ములుగు మండలం పత్తి పల్లి గ్రామానికి చెందిన సముద్రాల స్వామి కి ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతనికి ఉన్న 12 ఎకరాల వ్యవసాయ భూమిని 2005 లో అమ్మి తన ముగ్గురు కుమారులకు హన్మకొండలో ఇళ్లు కట్టించినాడు. మిగిలిన భూమి ముగ్గురు కుమారుల పేరు మీద ఒక్కొక్కరికి ఎ.2.20 ఎకరాల పొలాన్ని రిజిష్టర్ చేశాడు. ఆ వృద్దాప్య దంపతులు బ్రతకడానికి నాలుగు ఎకరాల భూమిని ఉంచుకుని కౌలుకు ఇచ్చుకుంటు జీవనం సాగిస్తున్నాడు.

కానీ తన పెద్ద కుమారుడు మానవత్వాన్ని మర్చి తనకున్న నాలుగు ఎకరాల భూమిని కూడా నాకే ఇవ్వాలి , మీ ఇళ్లులు కట్టించినప్పుడు తానే డబ్బులు ఇచ్చాను. కాబట్టి నాలుగు ఎకరాలు తనకే చెందుతుందని తల్లిదండ్రులను నానా ఇబ్బందులకు గురి చేస్తు ఇంటిపై, వెళ్లి కన్నవారని చూడకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అంతేకాకుండా వారి ఇద్దరు తమ్ముళ్లు, వారి అక్కలు, బావలపైన కూడా కేసులు పెట్టినాడు. చిన్నప్పటి నుంచి కనిపెంచి వారికి చివరికి ఒక ప్రయోజకులను చేస్తే చివరికి నాపైనే కేసులు పెట్టి ఇంత ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్వామి బాధతో రోధిస్తున్నాడు. అంతేకాకుండా ఉన్నత చదువుకుని తమ పిల్లలను కూడా ఉన్నత చదువులు చదివించి ఇలా చేస్తుంటే వారు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక బాధపడుతున్నారు. ఇప్పటికైన ఇలాంటివి జరగకుండా కన్న తల్లిదండ్రులు దేవుళ్లతో సమానం కాబట్టి వారిని బాగా చూసుకుని తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి.