‘మై విలేజ్ షో’ ద్వారా ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన గంగవ్వ‌ కూడా ‘ఇస్మార్ట్ శంకర్‌’ సినిమాలో నటించనుంది. బుధవారం దర్శకుడు పూరి.. గంగవ్వను కలసి ఈ సినిమాలో నటించాలని కోరారు. ఇందుకు గంగవ్వ కూడా వెంటనే ఓకే చెప్పింది. వీరిద్దరూ దిగిన ఫొటో ఇప్పుడు షోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఇప్పటిదాకా యూట్యూబ్‌లో వినిపించిన గంగవ్వ మాటలు.. ఇక నుంచి వెండితెరపై కనిపించనున్నాయి. కంగ్రాట్స్ గంగవ్వ’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్‌’. పక్కా యాక్షన్ ఎంటర్టయినర్‌గా తెరకెక్కుతున్న సినిమాను , పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు…