మరణానికి కొన్ని క్షణాల ముందు

అప్పటి వరకూ ఫ్రెండ్స్ అందరూ సరదాగా గడిపారు. ఊటీ అందాలను చూసేందుకు రిసార్ట్ నుంచి బయలుదేరి కారులో షికారుకెళ్లారు. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో కారు లోయలో పడింది. మొత్తం ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా. ఇద్దరు కొనఊపిరితో రెండురోజులపాటు మరణంతో పోరాడారు. చివరకు రెస్క్యూటీమ్ వీరిని గుర్తించి లోయలోనుంచి బైటకు తీసింది.
చెన్నైకి చెందిన ఏడుగురు మిత్రులు.

గత నెల 30న చెన్నై నుంచి ఓ కారులో ఊటీకి వెళ్లారు. అక్కడి ఓ రిసార్ట్‌ను అద్దెకు తీసుకున్నారు. తొలిరోజు ఊటీలోనే ఉన్న వీరంతా ఈనెల 1వతేదీ ముదుమలై శరణాలయం సందర్శనకు వెళ్లారు. రెండురోజులైనా తిరిగి రాకపోవడంతో రిసార్ట్ వారికి అనుమానం వచ్చింది. ఫోన్లు కూడా స్విచాఫ్ రావడంతో పోలీసులకు సమాచారమిచ్చారు.

చివరకు పోలీసులకు వచ్చిన సమాచారంలో ప్రమాదం విషయం బైటపడింది.

అతిలోక సుందరి శ్రీదేవి ,పెద్ద వేషంలో చిన్న కూతురు.