బిగ్ బ్రేకింగ్….
వరంగల్: అమెరికాలో మరో తెలుగు యువకుడిపై కాల్పుల. ప్రాణాపాయ స్థితిలో సాయి కృష్ణ.
మహబూబాబాద్ పట్టణానికి చెందిన పూస.సాయి కృష్ణ పై అమెరికా లోని మిచిగాన్ రాష్ట్రంలో కాల్పులు. ప్రాణాపాయ స్థితిలో సాయి కృష్ణ .
అమెరికాలో మరో తెలుగు యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ లోని బెస్తం బజార్ కు చెందిన పూస ఎల్లయ్య, శైలజల కుమారుడు సాయికృష్ణ మిచిగాన్ రాష్ట్రంలో నివాసముంటున్నాడు. ఈ నెల 3న రాత్రి ఓ దొంగ సాయి కృష్ణపై కాల్పులు జరిపి పరారయ్యాడు. అతని వద్ద ఉన్న డబ్బులు, గుర్తింపు కార్డులను అపహరించాడు. సాయికృష్ణ ప్రస్తుతం అమెరికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సాయికృష్ణ చికిత్స కోసం అమెరికాలోని తెలుగు సంఘాలు విరాళాలు సేకరిస్తున్నాయి. జనవరి 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.