ప్రముఖ సినీ నటి ప్రియాంక నల్కారి పెళ్లి పీటలు ఎక్కింది. సీక్రెట్‌గా ప్రియుడు, నటుడితో మలేషియాలో ఏడుడుగులు వేసింది. ఈ విషయాన్ని ప్రియాంకస్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసి షాకిచ్చింది. అయితే ఎలాంటి హడావుడి లేకుండ సీక్రెట్‌గా గుడిలో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రియాంక వెండితెరపై, బుల్లితెరపై నటిగా మంచి పాపులారిటి సంపాదించుకుంది. 2010లో విడుదలైన ‘అందరి బంధువయా’ సినిమాతో నటిగా పరిచయమైంది. తమిళంలో ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’, ‘కాంచన-3’ సినిమాల్లో నటించింది. ఇక ప్రియాంక పెళ్లి చేసుకున్న వ్యక్తి విషయానికి వస్తే అతడి పేరు రాహుల్ వర్మ, నటుడు, బిజినెస్‌ మేన్‌ అని సమాచారం. అతడు తెలుగులో పలు సీరియల్స్‌లో నటించాడు.

Advertisement

అదే క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట 2018లో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఇద్దరు కెరీర్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరు కుటుంబ సభ్యులు లేకుండానే మలేషియాలోని మురుగన్ ఆలయంలో వీరిద్దరు రహస్య వివాహం చేసుకున్నట్లు సమాచారం. తన పెళ్లి ఫొటోలు షేర్‌ చేస్తూ #JustMarried అనే హ్యాష్‌‌ట్యాగ్‌ను జత చేసింది. ఆమె పోస్ట్‌ చూసి అంతా షాక్‌ అవుతున్నారు. సడెన్‌గా ఇలా రహస్య వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏముందంటూ నెటజన్లు ఆరా తీస్తున్నారు. కాగా ప్రియాంకకు తెలుగులో ప్రస్తుతం అవకాశాలు లేనప్పటికీ తమిళంలో నటిగా ఫుల్‌ బిజీగా ఉంది. తమిళ్‌లో ఆమె నటిస్తున్నరోజా సీరియల్‌ టాప్‌ రేటింగ్‌తో దూసుకుపోతోంది.