రెండు రోజులుగా కాస్తా తగ్గు ముఖంగా ఉన్న ఎండల తీవ్రత మళ్లీ పెరగనుంది. మంగళవారం ఆకాశం మేఘావృతమై ఉండడంతో రోజు వారీ ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 40.3 డిగ్రీలు నమోదు కాగా, కనిష్ఠంగా 29.9 డిగ్రీలు నమోదైంది.
ఇక బుధవారం నుంచి ఉష్ణోగ్రత్తలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని, అది 41 నుంచి 42 డిగ్రీల దాకా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడింది. గ్రేటర్ పరిధిలో వచ్చే వారం రోజుల పాటు పగటి పూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి, వడగాలులు ఉండే అవకాశం ఉంది.81 News
మే నెలలో సగం రోజులు గడిచిపోగా, మిగతా రోజుల్లో ఎండలు ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండా కాలంలో ఎక్కువగా మంచినీరు, చల్లని పానీయాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.