మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుడితో పాటు ఇద్దరు కస్టమర్లను టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అరెస్ట్‌ చేశారు. నల్గొండ బొట్టుగూడకు చెందిన పజ్జూరు వెంకటేష్‌ (24) విఠల్‌వాడీ నారాయణగూడలో నివసిస్తున్నాడు. సన్‌బ్రిడ్జ్‌ అపార్ట్‌మెంట్‌లో ‘థ్యాంక్యూ రిఫ్రెష్‌ బ్యూటీ అండ్‌ హెల్త్‌కేర్‌’ పేరుతో మసాజ్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. మసాజ్‌ సెంటర్‌ ముసుగులో అమ్మాయిలతో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. తన వద్దకు వచ్చిన కస్టమర్‌ల నుంచి రూ. 4,000ల నుంచి 5000 వసూలు చేసేవాడు. పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది స్పాపై దాడి చేసి నిర్వాహకుడు వెంకటేష్‌, పవన్‌సాగర్‌, మేహుల్‌ మెహతా ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.6,800 నగదు, 9 సెల్‌ఫోన్‌లు, కార్డ్‌ స్వైపింగ్‌ మెషిన్‌, కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నారు.తదుపరి విచారణ కోసం నిందితులతోపాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని నారాయణగూడ పోలీసులకు అప్పగించారు.