మసాజ్ పార్లర్స్ దందా యువత జేబులు గుల్ల చేసే విధంగా సాగుతున్నాయి. అంద‌మైన అమ్మాయిల‌ను ఆకర్షణీయమైన జీతంతో కూడిన ఉద్యోగమంటారు, బంగారు భవిష్యత్తును చూపిస్తామంటారు, చివరకు నమ్మించి వ్యభిచార రొంపిలోకి దింపుతారు. తాజాగా మసాజ్ కోసం పార్లర్‌కి వెళ్లిన వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది.

Advertisement

వివ‌రాలు:. దుబాయ్‌లో నివసించే ఓ వ్యక్తి రెండ్రోజుల క్రితం ఓ పార్లర్‌కి వెళ్లి మసాజ్ కావాలని కోరాడు. దానికి వారు 400 దిర్హామ్‌ తీసుకుని ఓ గదిలోకి పంపారు. అయితే కాసేపటికి గదిలోకి వచ్చిన ఓ యువతి అతడిని మంచంపై పడుకోబెట్టింది. ఈ క్ర‌మంలోనే తన దుస్తులన్నీ విప్పేసి అతడి పక్కన పడుకుంది. దీంతో షాక్ అయిన ఆ యువ‌కుడు వెంట‌నే పైకి లేచి మసాజ్ చేయమంటే దుస్తులన్నీ ఎందుకు విప్పావంటూ ప్ర‌శ్నించారు. దీనికి ఆమె ఇది మసాజ్ పార్లర్ కాదని, వ్యభిచారం కేంద్రమని మసాజ్‌తో పాటు తనతో సెక్స్ కూడా చేసుకోవచ్చని చెప్ప‌డంతో కంగుతిన్నాడు.

దీంతో వెంట‌నే స‌ద‌రు వ్య‌క్తి బయటకు వెళ్లి తానిచ్చిన డబ్బు తిరిగిచ్చేయాలని నిలదీశాడు. ఒక్కసారి చెల్లించిన ఫీజు తిరిగివ్వమని వారు చెప్పడంతో గొడవ చేశాడు. దీంతో నలుగురు యువకులు అతడిని చీకటి గదిలోకి లాక్కెళ్లి ఎముకలు విరిగిపోయేలా కొట్టి బయటకు తోసేశారు. స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు తనపై జరిగిన దారుణంపై ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్క‌డ సెక్స్ దందాని నిర్వహిస్తున్న‌ నలుగురు నిందితులను అరెస్ట్ చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.